డియర్ కామ్రేడ్ ఫస్ట్ లిరికల్ సాంగ్‌ విన్నారా..?

గీత గోవిందం చిత్రంలో రొమాంటిక్ జోడిగా పేరు తెచ్చుకున్న రష్మిక..విజయ్ దేవరకొండ..మరోసారి ప్రేక్షకుల ముందుకు డియర్ కామ్రేడ్ గా రాబోతున్నారు. భరత్ కమ్మ డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ మూవీ మే 31 న వరల్డ్ వైడ్ గా తెలుగు , తమిళ్ , మలయాళం , కన్నడ భాషల్లో విడుదల కాబోతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న నేపథ్యంలో చిత్రం ఫస్ట్ లిరికల్ సాంగ్‌ ను సోమవారం చిత్ర యూనిట్ విడుదల చేసారు.

‘నీ నీలి కన్నుల్లోని ఆకాశమే.. తెల్లారి అల్లేసింది నన్నే’.. అంటూ సాగిన ఈ బ్యూటిఫుల్ మెలోడి సాంగ్‌ను గౌతమ్ భరద్వాజ్ వినసొంపుగా ఆలపించగా, జస్టిన్ ప్రభాకరణ్ బ్యూటిఫుల్ ట్యూన్‌కి రెహ్మాన్ అద్భుతమైన లిరిక్స్ అందించారు. మరి ఈ సాంగ్ ఎలా ఉందో మీరు కూడా వినండి.