Kubera : ‘కుబేర’ కొత్త షూటింగ్ షెడ్యూల్ బ్యాంకాక్‌లో ప్రారంభం


నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్, కింగ్ నాగార్జున అక్కినేని, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘కుబేర’. మహా శివరాత్రి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ధనుష్ డిఫరెంట్ అవతార్ అందరినీ ఆశ్చర్యపరిచింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

Chaari 111 : అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న వెన్నెల కిషోర్ ‘చారి 111’..

తాజాగా టీమ్ బ్యాంకాక్‌లో కొత్త షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభించింది. నాగార్జునతో పాటు మరికొందరు నటీనటులు పాల్గొంటున్న ఈ షెడ్యూల్‌లో కొన్ని టాకీ, యాక్షన్ పార్ట్‌లు చిత్రీకరించనున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా ఇంతకు ముందు ఎవరూ చూడని కొన్ని అద్భుతమైన లొకేషన్లలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన వర్కింగ్ స్టిల్ లో నాగర్జున, శేఖర్ కమ్ముల సంభాషిస్తూ కనిపించారు. బ్యాక్ గ్రౌండ్ లో వండర్ ఫుల్ వ్యూని గమనించవచ్చు. ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయిక. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.