ఈవారం నాలుగు సినిమాలు

2gow1g79

లెజెండ్‌, రేసుగుర్రం వినోదాలు పంచేశాయి. ఇక బాక్సాఫీసుద‌గ్గ‌ర మ‌రో పెద్ద సినిమా రావ‌డానికి చాలాటైమ్ ఉంది. ఈలోగా చిన్న సినిమాలు వ‌రుస క‌డుతున్నాయి. ఈవారం 4 సినిమాలు విడుద‌ల‌కు ముస్తాబ‌య్యాయి. ప్ర‌తినిధి, చంద‌మామ క‌థ‌లు, బిల్లారంగ‌, గ‌లాటా బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఢీ కొట్ట‌బోతున్నాయి. వీటిలో ప్ర‌తినిధి, చంద‌మామ క‌థ‌ల‌పై కొన్ని అంచ‌నాలున్నాయి. రెండు సినిమాల ట్రైల‌ర్లు ఆక‌ట్టుకొంటున్నాయి. ముఖ్య‌మంత్రి కిడ్నాప్ నేప‌థ్యంలో సాగే పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ ప్ర‌తినిథి. నారా రోహిత్ క‌థానాయ‌కుడిగా న‌టించాడు. సోలో త‌ర‌వాత రోహిత్‌కి హిట్ రాలేదు. ఈసారి ఎలాగైనా స‌రే.. ఓ క‌మ‌ర్షియ‌ల్ విజ‌యం త‌న ఖాతాలో వేసుకొందామ‌ని చూస్తున్నాడు. ఈ సినిమా ఎప్పుడో విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. కానీ… స‌రైన డేట్ దొర‌క్క ఇంత వ‌ర‌కూ ఆగాల్సివ‌చ్చింది. ఇప్పుడు పొలిటిక‌ల్ సినిమాల సీజ‌న్ న‌డుస్తోంది. ఎన్నిక‌ల వేడి రాజుకొంది. ఈ ద‌శ‌లో ప్ర‌తినిథి ఏం చెబుతాడో మ‌రి. ఎనిమిది క‌థ‌ల స‌మాహారం చంద‌మామ క‌థ‌లు. ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఎల్బీడ‌బ్ల్యూ, రొటీన్ ల‌వ్‌స్టోరీ చిత్రాల‌తో విమ‌ర్శ‌కుల‌ను మెప్పించిన ద‌ర్శ‌కుడీయ‌న‌. మంచు ల‌క్ష్మి ప్ర‌స‌న్న డేరింగ్‌స‌న్నివేశాలు, న‌రేష్ – ఆమ‌నిల లిప్‌లాక్ ఈ సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ కానున్నాయి. ఇక శ్రీ – హ‌రిప్రియ‌ల సినిమా గ‌లాటా కూడా ఈ శుక్ర‌వార‌మే రాబోతోంది. మ‌రి వీటిలో ప్రేక్ష‌కుల ఓటు ఏ సినిమాకో తెలియాలంటే ఇంకొన్ని గంట‌లు ఆగితే స‌రిపోతుంది.