తమన్నా – గోపీచంద్ మధ్య వార్..

మ్యాచోస్టార్‌ గోపీచంద్‌..తమన్నా జంటగా సంపత్ నంది డైరెక్షన్లో సీటీమార్ అనే స్పోర్ట్స్ నేపధ్య మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ లో గోపిచంద్ ఆంధ్ర కబడ్డీ జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తుండగా.. తమన్నా తెలంగాణ కబడ్డీ జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం తాలూకా టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల ఆకట్టుకోగా..తాజాగా తమన్నా తాలూకా ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. ఈ మూవీ లో తమన్నా జ్వాలా రెడ్డి గా కనిపించబోతుంది.

అయితే తమన్నా – గోపీచంద్ మధ్య గేమ్ కి సంబంధించి మంచి వార్ ఉంటుందట. రీసెంట్ గా మొదలైన షెడ్యూల్ లో యాక్షన్ సీక్వెన్సెస్ షూట్ చేస్తున్నట్లు సమాచారం. బలమైన యాక్షన్ సీక్వెన్స్ తో విజువల్స్‌తో ఈ సినిమా ఉండబోతుందని చిత్ర యూనిట్ చెపుతున్నారు. ఈ సినిమాను ‘యు టర్న్’ నిర్మాత శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయకిగా నటిస్తోంది. భూమిక, రావురమేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను ఈ వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు.