Bhimaa : ‘భీమా’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!


మాచో స్టార్ హీరో గోపీచంద్ మోస్ట్ ఎవైటెడ్ చిత్రం భీమా మార్చి 8వ తేదీన మహా శివరాత్రి సందర్భంగా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎ హర్ష దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కెకె రాధామోహన్ నిర్మించగా.. ప్రియా భవానీ శంకర్‌, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫ‌స్ట్ లుక్‌ పోస్టర్‌, టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

‘భీమా’ ట్రైల‌ర్‌ను ఫిబ్ర‌వ‌రి 24న సాయంత్రం 4 గంట‌ల‌కు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మునుపెన్నడూ చూడని లుక్‌లో గోపీచంద్‌ని ప్రెజెంట్ చేస్తూ ట్రైలర్ పోస్టర్ ఆశ్చర్యపరిచింది. ఇక ఈ సినిమాలో గోపీచంద్‌ పవర్‌ ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్నాడు. KGF మరియు సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.