Bhimaa : ‘భీమా’ సినిమా కేక పుట్టిస్తుంది.. అందులో డౌట్ లేదు : హీరో గోపీచంద్


మాచో హీరో గోపీచంద్ మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భీమా’. ఈ సినిమాకి ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హన్మకొండ వరంగల్ లో మ్యాసీవ్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పద్మశ్రీ గడ్డం సమ్మయ్య ఈ వేడుకకు అతిథులుగా హాజరయ్యారు.

ప్రీరిలీజ్ ఈవెంట్లో మాచో హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత మీ అందరినీ చూడటం చాలా ఆనందంగా వుంది. ఇన్నేళ్ళ నుంచి నన్ను మీ గుండెల్లో పెట్టి చూసుకుంటున్న మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ వేడుకకు అతిథులుగా వచ్చిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారికి , పద్మశ్రీ గడ్డం సమ్మయ్య గారికి ధన్యవాదాలు. ఈ సినిమా మొదలుకావడానికి కారణం మా కో ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు. ఆయనే హర్ష ని పరిచయం చేశారు. భీమా అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. ప్రతి సీన్ చాలా బావుటుంది. నేను సాధారణంగా ఇలా చెప్పను.. కానీ ఈ సినిమా కేక పుట్టిస్తుంది. అందులో సందేహం లేదు.

ఇంత బాగా సపోర్ట్ చేసిన నిర్మాత రాధామోహన్ గారికి ధన్యవాదాలు. సినిమా ఇంత బాగా రావడానికి కారణం ఆయనే. చాలా గ్రాండ్ గా నిర్మించారు. కో స్టార్స్ మాళవిక, ప్రియ, ఈ సినిమాలో నటించిన అందరికీ ధన్యవాదాలు. మా మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా వేరే లెవల్ లో కొట్టాడు. రామ్ లక్ష్మణ్, వెంకట్, రవి వర్మ చాలా ఎక్స్ ట్రార్డినరీ ఫైట్ సీక్వెన్స్ ఇచ్చారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ ఫైట్స్ గొప్పగా అలరిస్తాయి. అజ్జు చాలా పవర్ ఫుల్ డైలాగ్స్ రాశాడు. తను చాలా మంచి రైటర్ అవుతాడు. ఈ సినిమాలో పని చేసిన ప్రతి టెక్నిషియన్ కి థాంక్స్. ఈ వేడుకకు సహకరించిన పోలీసులకు, కాలేజ్ యాజమాన్యానికి అందరికీ ధన్యవాదాలు తెలిపారు.