‘చాణక్య’ ధైర్యం ఏంటో తెలియడం లేదే

గోపీచంద్‌ హీరోగా తిరు దర్శకత్వంలో తెరకెక్కిన ‘చాణక్య’ చిత్రం అక్టోబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గోపీచంద్‌ గత చిత్రాల దృష్ట్యా ఈ చిత్రంపై జనాల్లో ఏమాత్రం అంచనాలు లేవు. మెహ్రీన్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన గత చిత్రం పంతం కూడా పెద్దగా సక్సెస్‌ అవ్వలేదు. ఇలాంటి సమయంలో మెగాస్టార్‌ చిరంజీవి ‘సైరా’ చిత్రంతో ఈ చిత్రంను ఢీ కొట్టడం కాస్త ఆశ్చర్యంగా ఉంది. ఈ చిత్ర యూనిట్‌ సభ్యులు పిచ్చి పని చేస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

భారీ అంచనాల నడుమ సైరా చిత్రం అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సైరా చిత్రం వచ్చిన మూడు రోజుల్లోనే చాణక్య చిత్రం రాబోతుంది. సైరా మొదటి వారాంతం పూర్తి అయ్యే వరకు కూడా చాణక్య ఆగడం లేదు. ఖచ్చితంగా మొదటి వారాంతం వరకు సైరా చిత్రం దుమ్ము రేపడం ఖాయం. టాక్‌ ఎలా ఉన్నా కూడా ఓపెనింగ్స్‌ మాత్రం భారీగా వస్తాయి. ఆ విషయాన్ని పట్టించుకోకుండా చాణక్యను తీసుకు రాబోతున్నారు. ఇది ఖచ్చితంగా చాణక్యకు చేటు చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు.