చాణక్య కు మిక్సిడ్ టాక్…

గోపిచంద్, మెహ‌్రీన్ జంట‌గా యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ గా తెరకెక్కిన చిత్రం ‘చాణక్య‌’. తమిళ దర్శకుడు తిరు ద‌ర్శ‌క‌త్వంలో ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్నారు. దసరా కానుకగా ఈరోజు (అక్టోబర్ 05 న ) ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ , టీజర్స్ , మేకింగ్ , స్టిల్స్ ఇలా ప్రతిదానితో ఆకట్టుకోవడం తో సినిమా ఫై అంచనాలు పెట్టుకున్నారు. మరి ఆ అంచనాలకు తగ్గట్లు సినిమా ఉందా..లేదా అనేది పబ్లిక్ టాక్ లో చూద్దాం.

ఇక ఈ చిత్రాన్ని చూసిన సినీ ప్రముఖులంతా సినిమా చాల బాగుందని సోషల్ మీడియా ద్వారా వారి అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు. ప్రముఖ డైరెక్టర్ శ్రీను వైట్ల.. సినిమా చాలా గ్రిప్పింగ్‌గా ఉందని, చాలా బాగా తీశారని కొనియాడారు. స్పై థ్రిల్లర్‌లో ఒక వైవిధ్య కోణాన్ని ఎంపిక చేసుకుని చూపించారన్నారు. గోపీచంద్ లుక్ ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని విధంగా ఉందని పేర్కొన్నారు. స్పై పాత్రలో ఆయన చాలా బాగా నటించారని చెప్పారు. డీఓపీ వెట్రి వర్క్ తెరపై చూడటానికి ఎంతో బాగుందన్నారు. శ్రీ చరణ్ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారని ప్రశంసించారు. తిరు డైరెక్షన్ కూడా చాలా గొప్పగా ఉందని కొనియాడారు.

అలాగే సినీ రచయిత గోపీమోహన్ ..ఇది గ్రిప్పింగ్ యాక్షన్ థ్రిల్లర్ అని అన్నారు. ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, సెకండాఫ్ సూపర్ అని ట్వీట్ చేశారు. తిరు డైరెక్షన్, డైలాగులు, కెమెరా, రీరికార్డింగ్ సినిమాకు బలమని చెప్పుకొచ్చారు.

రఘు కుంచె.. సినిమా చాలా చాలా ఇంట్రస్టింగ్‌గా ఉందని ట్వీట్ చేశారు. సినీ ప్రముఖుల ట్వీట్స్ ఇలా ఉంటె సామాన్య ఆడియన్ మాత్రం సినిమాలో కొత్తదనం ఏమీలేదని, ఎప్పటిలానే రొటీన్‌గా ఉందని అంటున్నారు. అస్సలు లాజిక్ లేని రివేంజ్ స్టోరీకి ‘రా’ ఏజెంట్ రంగు అద్దారని విమర్శిస్తున్నారు. అవసరంలేని చోట పాటలు పెట్టి విసిగించారని ట్వీట్లు చేస్తున్నారు. ఓవరాల్ గా చాణక్య చిత్రానికి మిక్సిడ్ టాక్ వినిపిస్తుంది.