చాణక్య గా వస్తున్న గోపి..

గోపీచంద్ – తమిళ్ డైరెక్టర్ తిరు కాంబినేషన్లో ఓ యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అనిల్ సుంకర నిర్మించే ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఏ టైటిల్ పెడతారా అని నిన్నటి వరకు అంత ఎదురుచూసారు. తాజాగా వారి ఎదురుచూపులు తెరదించారు చిత్ర యూనిట్. ఈ చిత్రానికి చాణక్య అనే క్లాసిక్ టైటిల్ పెట్టి అందరికి ఆశ్చర్యం కలిగించారు. కొద్ది సేపటి క్రితం టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. తెలివిగా ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేసే వారిని చాళుక్యుడి తో పోలుస్తారు. గోపిచంద్ కూడా విలన్స్ ప్లాన్స్ ని చిత్తుచేస్తూ, ప్రత్యర్థులను ఆటాడుకునే ఇంటెలిజెంట్ హీరోగా కనిపిస్తాడేమో..

కొన్ని రోజుల క్రితం షూటింగ్ లో గోపి గాయపడగా..తాజాగా ఆ గాయాల నుండి కోలుకొని షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఇక ఈ చిత్రంలో గోపిచంద్ సరసన ‘ఎఫ్2’ భామ మెహ్రీన్ నటిస్తుంది. ఇక ఈ సినిమా ఫై గోపీచంద్ భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఎంతమంది డైరెక్టర్లతో పనిచేసిన కానీ హిట్ మాత్రం రాకపోయేసరికి..ఈసారి తమిళ్ డైరెక్టర్ ను నమ్ముకున్నాడు. మరి గోపి నమ్మకాన్ని తీరు నిలబెట్టుకుంటాడా లేదా అనేది చూడాలి.