‘రామబాణం’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్


మ్యాచో హీరో గోపీచంద్, డింపుల్ హయతి జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రామబాణం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన గ్లింప్స్‌ ఆకట్టుకున్నాయి. ఇక ఐఫోన్, దరువెయ్యరా పాటలు చార్ట్ బస్టర్స్ గా అలరించాయి.

ఇకపోతే తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 20న రాజమండ్రిలో జరిగే గ్రాండ్ ఈవెంట్ లో రామబాణం ట్రైలర్ ని విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ట్రెండీ అవుట్ ఫిట్ లో స్టయిలీష్ గా కనిపించారు గోపిచంద్. ఇక ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. జగపతి బాబు, కుష్బూ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీని మే 5 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.