ప్రభాస్ హీరోయిన్ ఇంకా డిసైడ్ కాలేదు

బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ సంచలన విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ సాహో కోసం రంగంలో దిగబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ షూట్ లో పాల్గొన్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్. అయితే ఈ సినిమా కోసం ఇంకా హీరోయిన్ వేట కొనసాగుతోంది.

ఇందుకోసం రోజుకో భామ పేరు ప్రచారంలోకి వస్తోంది. తెలుగు, తమిళం, హిందీ… ఈ మూడు భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం కాబట్టి, అన్ని చోట్లా గుర్తింపు ఉన్న కథానాయికనే ఎంపిక చేసుకోవాలని చిత్రబృందం భావిస్తుంది. మొదట తమన్నా, ఆ తర్వాత కత్రినాకైఫ్‌ పేర్లు పరిశీలనలోకి వహ్చాయి. తాజాగా పూజా హెగ్డే పేరు తెరపైకి వచ్చింది. ఈ ముగ్గురు భామలకీ జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. కత్రినా, తమన్నా బాలీవుడ్‌లో ఇదివరకే విజయాల్ని సొంతం చేసుకొన్నారు. పూజా హెగ్డే ‘మొహొంజొదారో’లో హృతిక్‌ రోషన్‌ సరసన నటించి గుర్తింపు తెచ్చుకొంది. మరి ఇందులో ఎవరు ఫైనల్ అవుతారో అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.