పిట్ట కొంచెం.. కూత ఘనం అంటే.. ఇదే ! 

ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు ‘ఓ పిట్టకథ’ అనే చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు చెందు ముద్దు దర్శకత్వం వహించారు. ఈ చిన్న సినిమాను భవ్య సంస్థ టేకప్ చేసింది. కొత్త దర్శకుడు, కొత్త హీరోలు, కొత్త హీరోయిన్.. అయినా భారీగా ప్రమోట్ చేస్తున్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు మెగాస్టార్ ను తీసుకొచ్చారు. దాంతో.. ఈ చిన్ని సినిమా ప్రేక్షకుల నోళ్లలో నానేలా చేశారు.

ఈ చిన్ని చిత్రానికి ఎందుకు ఇంత ప్రమోషన్ అంటే.. ? కొత్త దర్శకుడు చెందు ముద్దు దగ్గర కాస్త విషయం వుందని అంటున్నారు. సినిమా విడుదలయిన తరువాత మరో మంచి దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడని అందరూ అంటారని చెబుతున్నారు. ఈ మధ్య థ్రిల్లర్ సినిమాలు చాలానే వచ్చేస్తున్నాయి. కానీ వాటిన్నింటిలో మోడరన్ టచ్ వున్న లవ్ స్టోరీలు వుంటాయి. కానీ ఓ పిట్టకథలో కాస్త ఇన్నోసెంట్ లవ్ స్టోరీ కనిపిస్తోంది. మరీ.. ఈ జనరేషన్ కి పిఠ కథ ఎక్కుతుందా ? అన్నది చూడాలి.