జోనర్ మార్చుకున్న ఆది.

Aadi-Garam

‘ప్రేమ కావాలి’ మూవీ తో తెలుగు ఇండస్ట్రీ లోకి హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సాయి కుమార్ తనయుడు ఆది..ఆ తర్వాత సుకుమారుడు మూవీ తో పర్వాలేదు అనిపించుకున్నాడు..కానీ ‘గాలిపటం, రఫ్, గరం’ వంటి వరుస డిజాస్టర్స్ తో వెనుకంజలో పడ్డాడు..ప్రస్తుతం ఓ హిట్ కోసం విపరీతంగా ట్రై చేస్తున్నాడు.

ప్రస్తుతం శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వం లో చేస్తున్న మల్టీ స్టారర్ ‘శమంతకమణి’ చిత్రంలో నటిస్తూనే టీవీ యాంకర్ ప్రభాకర్ దర్శకుడిగా మారుతూ చేస్తున్న మరొక చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తిగా హర్రర్ జానర్లో ఉండబోతుంది. ఇన్నాళ్లు తనను మాస్ రోల్స్, రొమాంటిక్ సినిమాలో మాత్రమే చూసిన ప్రేక్షకులకు ఈసారి మాత్రం మరోకొత్త ఆది ని చూడబోతున్నారని అంటున్నాడు.

Aadi-vaibhav

ఇప్పటికే 10 రోజుల షూటింగ్ ముగించుకున్న ఈ చిత్రంలో మరాఠీ నటి, తమిళ నటుడు సంతానం సరసన ‘సర్వర్ సుందరం, సక్కా పోదు పోదు రాజా’ లాంటి సినిమాలో హీరోయిన్ గా నటించిన వైభవి శాండిల్య హీరోయిన్ గా నటిస్తోంది. యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన వి4 మూవీస్ బ్యానర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.