‘ఇండియన్‌ 2’ విడుదల ఎప్పుడో తెలుసా?

కమల్‌ హాసన్‌, శంకర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రంను ఇండియన్‌ సినీ ప్రేక్షకులు అంత సులభంగా మర్చి పోరు. వారిద్దరు సృష్టించిన ఆ అద్బుతానికి ప్రస్తుతం సీక్వెల్‌ తెరకెక్కుతుంది. కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతుంది. ఈ సమయంలోనే సినిమా క్యాన్సిల్‌ అయ్యిందని కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే సినిమా క్యాన్సిల్‌ అంటూ వస్తున్న వార్తలను చిత్ర యూనిట్‌ సభ్యులు కొట్టి పారేస్తున్నారు. సినిమా షూటింగ్‌ మళ్లీ మొదలు పెట్టబోతున్నారు. కొన్ని కారణాల వల్ల షూటింగ్‌ ఆలస్యం అవుతుంది, కాని సినిమా మాత్రం ఆగలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.

ఇక తాజాగా ఈ చిత్రం విడుదల తేదీపై కూడా క్లారిటీ వచ్చేసింది. మొదట 2020వ సంవత్సరంలో విడుదల చేయాలని భావించినా కూడా షూటింగ్‌ ఆలస్యం అవ్వడం వల్ల సినిమాను 2021వ సంవత్సరంలో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. డేట్‌ కూడా క్లారిటీగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. తమిళ సంవత్సరాది అయిన మార్చి 14వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అదే రోజున ఇండియన్‌ పలు భాషల్లో రాబోతున్నాడు. తెలుగులో ఈ చిత్రంను భారీగా విడుదల చేయబోతున్నారు.