‘అర్జున్ రెడ్డి’ తో కొరటాల..?

రైటర్ గా సినిమా కెరియర్ మొదలు పెట్టిన కొరటాల శివ..ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా స్థానం సంపాదించుకున్నాడు. మిర్చి, శ్రీ‌మంతుడు, జ‌న‌తా గ్యారేజ్‌, భ‌ర‌త్ అనే నేను ..ఇలా వ‌రుస విజ‌యాలు ఆయన్ను టాప్ కుర్చీలో కూర్చోపెట్టాయి. ప్రస్తుతం ఈయన కోసం అగ్ర హీరోలు, అగ్ర నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఎంత టైంయినా తీసుకొని మాతో సినిమా చేయాలంటూ వెంట పడుతున్నారు. ప్రస్తుతం ఈయన మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు.

భరత్‌ అనే నేను తరువాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న కొరటాల, చిరంజీవి కోసం ఇంట్రస్టింగ్‌ స్క్రిప్ట్‌ రెడీ చేశాడట. ఈ సినిమా తరువాత కొరటాల అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ తో ఓ సినిమా చేసేందుకు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఓ ఫంక్షన్ లో కలిసిన వీరిద్దరూ సినిమా గురించి మాట్లాడుకున్నారని, విజయ్ సైతం శివతో సినిమాకు సిద్ధం అన్నట్లు చెప్పడంతో త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన వివరాలు అధికారికంగా బయటకొస్తాయని అంటున్నారు.

ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. విజయ్ నటించిన టాక్సీవాలా నవంబర్ 16 న విడుదల అవుటుతుండగా, డియర్‌ కామ్రేడ్‌ చిత్రం సెట్స్ ఉంది.