నాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారి’ రిలీజ్ డేట్


యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఇప్పటికే టీజర్, ఫస్ట్ సింగల్ తో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచిన ఈ చిత్రం కొత్త విడుదల తేదిని చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘కృష్ణ వ్రింద విహారి’ సమ్మర్ రేసులోనే మే20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో నాగశౌర్య సూపర్ కూల్‌గా కనిపించారు. ఈ చిత్రంలో రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు.