స్లో అయ్యిన లవర్..

విజయ్ దేవరకొండ కు డియర్ కామ్రేడ్ దెబ్బ గట్టిగానే పడింది..గత సినిమాల క్రేజ్ దృష్ట్యా..డియర్ కామ్రేడ్ చిత్రాన్ని విజయ్ భారీగా ప్రోమోట్ చేసాడు. సినిమా ఓ రేంజ్ లో ఉందనే బిల్డప్ ఇచ్చాడు. తీరా థియేటర్స్ లోకి వెళ్లక అసలు సినిమా కనిపించింది. దీంతో విజయ్ తదుపరి సినిమాఫై జాగ్రత్తపడుతున్నారు. సినిమా టాక్ బట్టి మాట్లాడాలని డిసైడ్ అయ్యాడు.

అందుకే వరల్డ్ ఫేమస్ లవర్ గురించి పెద్దగా ఎక్కడ చెప్పడం లేదు. మరోపక్క విజయ్ సైలెంట్ గా ఉండడం..పెద్దగా ప్రమోషన్ చేయకపోవడం తో సినిమా కు అసలు బజ్ రావడం లేదు.ఇప్పటివరకు విడుదలైన సాంగ్స్ కూడా మామూలుగానే ఉండడం తో ఇంకాస్త ఇబ్బంది గా మారింది. దీంతో దర్శక , నిర్మాతలు రంగంలోకి దిగి సినిమా ను ప్రోమోట్ చేస్తున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోతుంది. మరి ఇప్పుడైనా విజయ్ రావాలని కోరుకుంటున్నారు.