టాలీవుడ్ ఇండస్ట్రీ లో మా ఎన్నికల హడావిడి నడుస్తుంది. గురువారం మా ఎన్నికలు ఎప్పుడు జరపాలనేదానిపై సమావేశమైన ప్రముఖులు..ఆగస్టు 22న మా జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలని .. సెప్టెంబర్ 12న అధ్యక్ష ఎన్నికలు జరపాలని నిర్ణయించారు. మా అధ్యక్ష పదవి కోసం ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ, సీవీఎల్ నరసింహారావు పోటీ పడుతున్నారు. ఎవరికి వారు ప్యానెల్ ఏర్పాటు చేసుకుంటూ.. సీనియర్ల మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు.