దసరా కి మహేష్ ఆగడు

mahesh
మహేష్ హీరోగా నటిస్తోన్న చిత్రం ’ఆగడు’. దూకుడు తరవాత మహేష్ – శ్రీనువైట్ల కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇది. తమన్న కథానాయిక. తాజాగా ఈ చిత్రకు ఓ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 26న దీనిని రిలీజ్ చేయాడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.దసరా సెలవులను దృష్టిలో పెట్టుకుని ఈ రిలీజ్ డేట్ ను నిర్ణయించారట.
అలాగే, ఆడియో వేడుకను ఆగష్టు 31న హైదరాబాదులో గ్రాండ్ గా నిర్వహిస్తారని అంటున్నారు.
రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ పోలీసాఫీసర్ గా నటిస్తున్నాడు. దూకుడు కాంబినేషన్ రిపీట్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు వున్నాయి.