దేవిశ్రీకి కంగ్రాట్స్‌ చెప్పిన మహేష్

mahesh
‘నాటా 2014’ సభల్లో భాగంగా సూపర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీప్రసాద్‌ యు.ఎస్‌.ఎ.లో ఇస్తున్న షోలకు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. అట్లాంటా, బే ఏరియాల్లో షోలు కంప్లీట్‌ చేసుకున్న దేవి ఈరోజు శనివారం డల్లాస్‌లో మ్యూజికల్‌ నైట్‌ చేయనున్నారు. దేవిశ్రీప్రసాద్‌ లైవ్‌ ప్రోమో చూసిన సూపర్‌స్టార్‌ మహేష్‌ చాలా థ్రిల్‌ అయ్యారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌ మాట్లాడుతూ ` ‘‘బిగ్‌ హలో టు ఫ్యాన్స్‌ ఇన్‌ యు.ఎస్‌.ఎ అండ్‌ కెనడా. దేవిశ్రీప్రసాద్‌ లైవ్‌ని ఎంజాయ్‌ చేస్తారని ఆశిస్తున్నాను. ఆల్‌ ది బెస్ట్‌ టు దేవిశ్రీప్రసాద్‌. డిఎస్‌పి లైవ్‌ ప్రోమో వీడియో చూశాను. టోటల్లీ న్యూ కైండ్‌ ఆఫ్‌ ఎఫర్ట్‌. అతని షోస్‌ బిగ్‌ సక్సెస్‌ కావాలని ఆశిస్తున్నాను. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేవిశ్రీప్రసాద్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలాసార్లు దేవిని కలిశాను. ఎందుకో మేమిద్దరం కలిసి పనిచేయడానికి కుదరలేదు. సుకుమార్‌గారి వల్ల ‘1’ చిత్రం చేయగలిగాం. అది అమేజింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌. అతని వర్క్‌ చాలా బాగుంటుంది. ‘1’ అనే సినిమాకి మ్యూజిక్‌ చెయ్యడం నాకు తెలిసి చాలా కష్టం. ఎందుకంటే అది రెగ్యులర్‌ తెలుగు సినిమా కాదు. వెరీ డిఫరెంట్‌ కైండ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌. హి డిడ్‌ ఎమేజింగ్‌ జాబ్‌. పర్టిక్యులర్‌గా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చాలా బాగుంటుంది. 4 రోజుల్లో సెకండాఫ్‌ కంప్లీట్‌ చేశాడు. దానికి ముందు నాకు దేవి ఫోన్‌ చేశాడు. చిన్న టెన్షన్‌ మొదలైంది. ఏమంటాడోనని. నాలుగు రోజులే టైమ్‌ ఎలా చెయ్యాలి అంటాడేమో అనుకున్నాను. కానీ, ఈ సీన్‌ బాగుంది, ఆ సీన్‌ బాగుంది అంటూ ఎంతో ఎంతూజియాస్టిక్‌గా చెప్పాడు. ఇలాంటి క్వాలిటీ మ్యూజిక్‌ చేయడం చాలా రేర్‌. హ్యాట్సాఫ్‌ టు దేవి. అప్పుడే సుకుమార్‌కి కూడా ఫోన్‌ చేసి చెప్పాను దేవి చాలా అమేజింగ్‌ మ్యూజిక్‌ ఇచ్చాడని. దేవికి ఫ్యాన్‌ని అయిపోయాను. ఎందుకంటే ఒక మ్యూజిక్‌ డైరెక్టర్‌ నుంచి అలాంటి రెస్పాన్స్‌ రావడం నాకు కొత్త. ఇప్పుడు యు.ఎస్‌.లో దేవి చేస్తున్న షోస్‌కి కూడా చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. కంగ్రాట్యులేషన్స్‌ టు దేవి’’ అన్నారు.

షో నిర్వాహకులు మాట్లాడుతూ ` ‘‘అట్లాంటా, బే ఏరియాల్లో షోలు కంప్లీట్‌ అయ్యాయి. చాలా ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. దేవిశ్రీప్రసాద్‌ పెర్‌ఫార్మెన్స్‌ అదిరిపోయింది. వేల సంఖ్యలో హాజరైన ప్రేక్షకులు దేవి మ్యూజిక్‌ని బాగా ఎంజాయ్‌ చేశారు. వచ్చేవారం వీకెండ్‌లో చికాగో, వర్జీనియాల్లో షోలు జరుగుతాయి. ఆగస్ట్‌ 2న న్యూజెర్సీలో జరిగే గ్రాండ్‌ షోలో దేవిశ్రీప్రసాద్‌ పుట్టినరోజు వేడుకలు జరపనున్నాం. యు.ఎస్‌.లోని వివిధ పట్టణాల్లో దేవిశ్రీప్రసాద్‌ షోలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు, ఆయన అభిమానులకు థాంక్స్‌’’ అన్నారు.