‘మహేష్ చాల ఓల్డ్ ‘ అనేసిన క్రేజీ హీరోయిన్..

kajal-maheshఇప్పుడు ఉన్న టాలీవుడ్ యంగ్ హీరోల్లో మహేష్ అంత అందగాడు ఎవరు లేరు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు..ఇండస్ట్రీ కి మహేష్ ఎంట్రీ ఇచ్చి చాల కాలమే అయిన తన అందాన్ని మిచ్చిన హీరో రాలేదు అనేది అక్షర సత్యం..అలాంటి అందగాడిని పట్టుకొని ‘మహేష్ చాల ఓల్డ్ ‘ అనేసింది ఓ క్రేజీ హీరోయిన్..ఇంతకి ఆ హీరోయిన్ ఎవరో మీరే చూడండి..

పూరి దర్శకత్వం లో ‘బిజినెస్ మాన్’ చిత్రం లో మహేష్ కు జోడి కట్టి మంచి మార్కులు కొట్టేసిన కాజల్, తాజాగా మరోసారి బ్రహ్మోత్సవం చిత్రం తో మహేష్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది..ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రాబోతుంది..ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్ లో పాల్గొన్న కాజల్ ని ఓ విలేఖరు ‘మహేష్ తో రెండు సినిమాల్లో నటించారు కదా మీకు ఎలా అనిపిస్తోంది ‘ అని ఓ ప్రశ్న అడుగగా కాజల్ దానికి సమాదానం అప్పుడు ఓల్డ్ మహేష్ బాబుతో నటించాను. కాని ఇప్పుడేమో చాల యాంగ్ మహేష్ బాబు తో నటించాను అంటూ సమాదానం చెప్పి షాక్ ఇచ్చింది.

మహేష్ బాబు ఈ చిత్రంలో చాల అందంగా ఉన్నాడని, దాంతో పాటే రోజు రోజుకి తయారువుతున్నాడని చెప్పుకొచ్చింది..ఒక్క కాజల్ మాత్రమే కాదు సమంత సైతం మహేష్ అందం అందర్ని ఈర్ష పడేలా చేస్తుందని , 24 ఏళ్ల యంగ్ కుర్రాడిలా కనిపిస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చింది.