అది నావ‌ల్ల కాదు: మ‌హేష్‌బాబు

mahesh-babuసినిమాల‌కోసం ఎన్ని ఫైట్ల యినా చేస్తా గానీ… ఇంట్లో త‌న‌యుడిచేత హోం వ‌ర్క్ చేయించ‌డం మాత్రం త‌న వ‌ల్ల కాదంటున్నాడు మ‌హేష్‌బాబు. సెట్లో ఎంత రిస్క్ అయినా తీసుకొంటా గానీ.. గౌత‌మ్‌తో హౌం వ‌ర్క్ మాత్రం చేయించ‌లేను. అదంతా న‌మ్రత చూసుకొంటుంది. వాడి అల్లరినీ, ఆనందాన్నీ చూస్తూ ఆస్వాదిస్తా అంతే.. అంటున్నాడు మ‌హేష్‌. “గౌత‌మ్ చాలా అల్లరి చేస్తాడు. చాలా ప్రశ్నలు అడుగుతాడు. వాటికి స‌మాధానాలు నాద‌గ్గర ఉండ‌వు. సినిమాచూస్తుంటే చాలా సందేహాలు వ‌స్తుంటాయి. ఇలా ఎందుకు జ‌రిగింది? అలాఎందుకు జ‌రక్కూడ‌దు అని ఆరా తీస్తుంటాడు. నమ్ర త అయితే ఓపిగ్గా స‌మాధానాలు చెబుతుంది“ అంటూ త‌న ముద్దుల కొడుకు ముచ్చట్లు చెప్పుకొచ్చాడు ప్రిన్స్‌..