‘SSMB28’ టైటిల్‌ అప్డేట్ ఎప్పుడంటే..


సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌ల క‌ల‌యిక‌లో వస్తున్న చిత్రం ‘SSMB28′(వ‌ర్కింగ్ టైటిల్‌). అత‌డు, ఖ‌లేజా లాంటి సినిమాల తర్వాత మహేష్ బాబు, త్రివిక్ర‌మ్‌తో క‌లిసి చేస్తున్న మూవీ కావ‌డంతో అంచ‌నాలు భారీ స్థాయిలోనే వున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన మహేష్ ఫస్ట్ లుక్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

అయితే టైటిల్ విషయంలో మాత్రం సస్పెన్స్ అలానే వుంది. అంతేకాదు పలురకాల టైటిల్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ‘గుంటూరు కారం’, ‘అమ‌రావ‌తికి అటు ఇటు’ తో పాటు ‘ఊరికి మొన‌గాడు’ వంటి పేర్లు వినిపిస్తున్నాయి. కాగా మొన్నటి వరకు ‘అమరావతికి అటు ఇటు’ అనే టైటిల్ ఖరారు అయ్యిందని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు ‘గుంటూరు కారం’ లేదా ‘ఊరికి మొన‌గాడు’ ఈరెండు టైటిల్స్ లో ఒకదానిని పెట్టబోతున్నారు అని తెలుస్తుంది. ఇకపోతే ఫ్యాన్స్ మాత్రం ఫస్ట్ లుక్ కి తగ్గట్టుగా మాస్ టైటిల్ అయితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ నెల 31న కృష్ణ గారి జయంతి సందర్భంగా ఈ సినిమా నుండి టైటిల్ రివీల్ చేసే అవకాశముంది. చూడాలి మేకర్స్ ఏ టైటిల్ ని అనౌన్స్ చేస్తారో మరి. ఇక ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2024, జనవరి 13 న విడుదల కానుంది.