Kannappa : ‘కన్నప్ప’ గా మంచు విష్ణు.. ఫస్ట్ లుక్ అదుర్స్ !


డైనమిక్ స్టార్ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తున్న చిత్రం ‘కన్నప్ప’. లెజెండరీ నటుడు, నిర్మాత శ్రీ మోహన్ బాబు గారు అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్నారు. స్టార్ ప్లస్ లో మహాభారత సిరీస్ కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇకపోతే ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను లాంచ్ చేసారు మేకర్స్.

LPG Gas : మహిళలకు మోదీ కానుక.. వంటగ్యాస్ ధర భారీగా తగ్గింపు

ఈ పోస్టర్ లో చేతిలో విల్లు పట్టుకున్న మంచు విష్ణు లుక్ ఆకట్టుకొంటోంది. నుపుర్ సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అంతేకాదు మంచు విష్ణు కొడుకు అవ్రామ్ మంచు కన్నప్ప సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో ఈ చిత్రంలో మూడు తరాలకు చెందిన మంచు కుటుంబ సభ్యులు నటిస్తున్నట్టు అయింది. ఇక ఈ చిత్రానికి స్టీఫెన్ దేవాసి సంగీతం అందిస్తున్నారు.