మ‌నోజ్‌తో న‌లుగురు అమ్మాయిలు

manoj-potugaaduహెడ్డింగ్ చూసి త‌ప్పుగా అనుకోకండి. మంచు మ‌నోజ్‌తో న‌లుగురు క‌థానాయిక‌లు జ‌త క‌డుతున్నార‌నేది మా మీనింగు. మ‌నోజ్ క‌థానాయ‌కుడిగా పోటుగాడు అనే సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాతో ప‌వ‌న్ అనే ద‌ర్శకుడు ప‌రిచ‌యం అవుతున్నాడు. ఈ సినిమాలో మ‌నోజ్‌కి జ‌త‌గా న‌లుగురు క‌థానాయిక‌లను ఎంచుకొన్నారు. న‌థాలియాకౌర్‌, సిమ్రాన్ ముండి, సోనాక్షి చౌద‌రి ఇప్పటి వ‌ర‌కూ డిసైడ్ అయ్యారు. మ‌రో క‌థానాయిక‌ను ఎంచుకోవ‌ల్సి ఉంది. వినోదం, యాక్షన్ క‌ల‌బోత‌గా సాగే సినిమా అట‌. ఫైట్స్ కొత్తగారావాల‌ని విదేశీ ఫైట్ మాస్టర్ల ను బ‌రిలోకి దించుతున్నార‌ట‌. ఈ చిత్రానికి చ‌క్రి సంగీతం అందిస్తున్నారు.