మేరీకోమ్‌ పాటల పంచ్!

mary-kom
ప్రియాంక లీడ్ రోల్ పోషిస్తున్న చిత్రం ‘మేరీకోమ్’. ప్రముఖ బాక్సింగ్‌ క్రీడాకారిణి మేరీకోమ్‌ జీవిత గాథ ఆధారంగా రూపుదిద్దుకొంటున్న చిత్రమిది.
మేరీకోమ్ రిలీజ్‌కు సిద్ధమైంది. తాజాగా ఈ మూవీ ఆడియోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మణిపూర్‌ బాక్సింగ్‌ క్రీడాకారిణి మేరీకోమ్‌, ప్రియాంక చోప్రా, సినిమా దర్శక నిర్మాతలు హాజరయ్యారు. తన జీవిత కథ ఆధారంగా ఓ చిత్రాన్ని రూపొందించడంపై మేరీకోమ్‌ హర్షం వ్యక్తం చేయగా, ఇటువంటి చిత్రాలు మరిన్ని రావాలని ప్రియాంక పేర్కొంది.