మెగా ఫ్యామిలీలో ఎవరికీ.. ఏమైంది..?

Ram-Charan-Landమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సడెన్ స్టేట్మెంట్ ఇచ్చి అభిమానులను కలవరపాటుకు గురిచేశాడు..వాస్తవానికి రేపు (అక్టోబర్ 15న) అమెరికాలోని న్యూ జెర్సీలో ”హ్యుమానిటీ యునైటెడ్ ఎగైనస్ట్ టెర్రర్” అనే ఈవెంటు లో రామ్ చరణ్ లైవ్ డ్యాన్సు చేస్తాడని అందరూ ఆసక్తిగా ఎదురుచూసారు. అయితే ఆఖరి నిమిషంలో ఈ కాన్సర్ట్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తోందని చరణ్ తన సోషల్ పేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసాడు..

ఇప్పటివరకు బాగానే ఉంది. కానీ తమ ఫ్యామిలీ ఏదో మెడికల్ ఎమర్జెన్సీ ఉండటం వలన.. అమెరికాలో రిపబ్లిక్ హిందూ కొయాలిషన్ వారు తలపెట్టిన ఈ కాన్సర్టులో పాల్గొనడం కుదరట్లేదని చరణ్ చెప్పడం తో మెగా ఫ్యామిలీ లో ఎవరికీ ఏమైంది అని అభిమానులు ఖంగారు పడుతున్నారు. ఎవరైనా సరే త్వరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.