‘మెగా156’ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.. !


మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజుని పురస్కరించుకుని స్వచ్ఛంద సేవా, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు చేస్తూ మెగా బర్త్ డేని జరుపుకునే అభిమానులకు ఇది ఒక పండగ లాంటి రోజు. మెగా అభిమానులను మరింత ఆనందపరిచే విధంగా, మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రం ‘మెగా156’ ఈరోజు అనౌన్స్ చేశారు.

‘మెగా156’ చిత్రాన్ని, చిరంజీవి ఖైదీ నంబర్ 150వ చిత్రం నుండి స్టైలిస్ట్‌గా వ్యవహరిస్తున్న సుస్మిత కొణిదెల భారీ స్థాయిలో నిర్మించనున్నారు. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మెగా156 రూపొందనుంది. ఇకపోతే త్వరలోనే చిత్ర దర్శకుడిని అనౌన్స్ చేస్తారు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.