కోరిక తీరింది

mohanbabu
‘విష్ణుని పోలీసు అధికారిని చేయాలనుకున్నాను. వాడి కోరిక మేరకు కథానాయకుడు అయ్యాడు. తన తాజా చిత్రంలో పోలీసుగా కనిపించాడు. విష్ణును అలా తెరపై చూసుకుంటే నా చిరకాల కోరిక తీరినట్లు అనిపించింది. దీనికి కారణం రామ్‌గోపాల్‌వర్మనే” అంటున్నారు మోహన్ బాబు.

మంచు విష్ణు ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘అనుక్షణం’. రామ్‌గోపాల్‌వర్మ దర్శకుడు. ఏవీ పిక్చర్స్ చిత్రాన్ని నిర్మిస్తోంది. మోహన్‌బాబు ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ”తొలి సన్నివేశం నుంచి శుభం కార్డు వరకు ప్రతిక్షణం ఉత్కంఠ రేకెత్తించేలా చిత్రం రూపొందింది. మానసిక నిపుణురాలిగా రేవతి నటన సినిమాకు ఆకర్షణగా నిలుస్తుంది” అంటూ సినిమా గురించి చెప్పారు మోహన్‌బాబు.