‘భగవంత్ కేసరి’ ఫస్ట్ సాంగ్ రిలీజ్.. ఎప్పుడంటే ?


గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ డెడ్లీ కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘భగవంత్ కేసరి’ మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభం కానున్నాయి. సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ గ్లిమ్ప్స్ కి టెర్రిఫిక్ రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుండి ఇంటరెస్టింగ్ అప్డేట్ ఒకటి వచ్చింది.

ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ గణేష్ సాంగ్ ను సెప్టెంబర్ 1న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్‌లో మునుపెన్నడూ లేని మాస్ అవతార్‌లో డ్రమ్స్ కొడుతూ కనిపించారు బాలకృష్ణ. పాటలోని ఎనర్జీ ఆయన ముఖంలోనే కనిపిస్తుంది. ఇకపోతే ఈ సినిమాలో బాలకృష్ణ తెలంగాణ యాసలో డైలాగులు చెబుతూ అలరించారు. ఇక కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. నేషనల్ అవార్డ్ విన్నర్ అర్జున్ రాంపాల్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 19న ‘భగవంత్ కేసరి’ విడుదల కానుంది.