నయన్ ఇది నిజమా..?

సౌత్ లేడీ సూపర్ స్టార్ గా నయనతార కు ఎంతో గుర్తింపు ఉంది. గ్లామర్ పాత్రలైనా , లేడి ఓరియంటెడ్ అయినా నయన్ చేయాల్సిందే..ఈమె తర్వాతే ఎవరైనా అని అభిమానులు , దర్శక నిర్మాతలు భావిస్తుంటారు. ఈమె ఆయా చిత్రాలకు ప్రమోషన్ రాకపోయినా కానీ ఆమెకు కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తుంటారు. ప్రమోషన్ కు రాను అని కేవలం నటించడం వరకే అని ముందే అగ్రిమెంట్ చేసుకుంటుంది. ఇప్పటివరకు అన్ని సినిమాలకు ఆలా చేస్తూనే ఉంది.

కాగా ఫస్ట్ టైం ఈమె ప్రమోషన్ లలో కనిపించబోతుంది. ఆ సినిమా ఏంటో ఇప్పటికే అర్థమై ఉంటుంది. అవును సైరా నరసింహ రెడ్డి కోసం నయనతార ప్రమోషన్ లలో పాల్గొనబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ ఏం చెప్పి ఒప్పించాడో తెలియదు కానీ సైరా కోసం నయనతార ప్రమోషన్ చేయబోతుంది. ఈ సినిమాతో పాటు విజయ్‌తో నటిస్తున్న బిగిల్ సినిమాకు కూడా ప్రమోషన్ చేయబోతుంది నయనతార.

ఈ రెండు సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలకు నయన్ హాజరు అవుతుందని తెలుస్తుంది. సైరా అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా చెన్నై, హైదరాబాద్‌లలో ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. వాటికి నయన్ వస్తుందనే తెలుస్తుంది.