పెళ్లి ఫోటోలు డిలీట్ చేసిన మెగా డాటర్.. ఇక విడాకులేనా ?


ఇటీవల విడాకులు, బ్రేకప్ విషయంలో సెలెబ్రిటీలు ఓ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా హింట్ ఇస్తున్నారు. ఫోటోలు డిలీట్ చేయడం, అన్ ఫాలో కావడం చేస్తున్నారు. ప్రొఫైల్ నేమ్ మార్చేస్తున్నారు. సమంత, శ్రీజా వంటి సెలెబ్రిటీలు ఇలాగే తమ విడాకులు కన్ఫర్మ్ చేశారు. నాగబాబు డాటర్ నిహారిక సైతం ఇదే తరహాలో పరోక్షంగా తెలియజేస్తున్నారనే వాదన వినిపిస్తోంది.

2020 డిసెంబర్‌ 9న జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక కలకాలం కలిసి ఉంటారని అనుకున్న ఈ జంట పెళ్లి మూడునాళ్ళ ముచ్చటగానే మారిందని అంటున్నారు. నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్య మధ్య విభేదాలు వచ్చాయని.. విడాకులు కూడా తీసుకోబోతున్నట్లు గత కొంతకాలంగా నెట్టింట వార్తలు జోరందుకున్నాయి.

ఇక సోషల్‌ మీడియా మాధ్యమమైన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఇద్దరు ఒకరినొకరు అన్‌ ఫాలో చేసుకోవడంతో అనుమానాలు షురూ అయ్యాయి. రీసెంట్ గా నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డ ఏకంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ నుంచి తన పెళ్లి ఫోటోలను డిలీట్‌ చేయడంతో మరోసారి ఈ విడాకుల చర్చ హాట్ టాపిక్ గా మారింది. అయితే నిహారిక ఇంకా పెళ్లి ఫోటోలు డిలీట్ చేయలేదుగా అని అనుకొనేలోపు ఆమెకూడా నేడు తన ఇన్స్టాగ్రామ్ నుంచి భర్తతో ఉన్న ఫోటోలు, పెళ్లి ఫోటోలు డిలీట్ చేసింది ఒక్క ఫోటో తప్ప. పెళ్లి మండపంలో చైతన్య పక్కన కూర్చుని ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు. అయితే ఇందులో వెంకట చైతన్య ఫోటో కాస్త బ్లర్ చేసారు. ఇక ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నా దగ్గర ఓ రహస్యం ఉంది. కానీ మీకు చెప్పేస్తే అది రహస్యం ఎలా అవుతుంది.సారీయే చెప్పలేను అనే క్యాప్షన్ కూడా పెట్టారు. దీంతో నిహారిక పరోక్షంగా హింట్ ఇచ్చేశారు. ఆమె విడాకులు తీసుకోవడం ఖాయమే అంటూ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.