పిక్‌టాక్‌ : జయలలితగా నిత్యామీనన్‌

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన నిత్యామీనన్‌ ప్రస్తుతం తమిళంలో అమ్మ బయోపిక్‌లో నటిస్తోంది. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ చిత్రంలో నిత్యామీనన్‌ లుక్‌ తాజాగా రివీల్‌ అయ్యింది. నిత్యామీనన్‌ లుక్‌ చూసి అంతా అవాక్కవుతున్నారు. నిజంగా అమ్మ మాదిరిగా నిత్యామీనన్‌ ఉంది అంటూ కామెంట్స్‌ వస్తున్నాయి. జయలలిత పాత్రకు పూర్తి న్యాయం చేసే సత్తా కేవలం నిత్యామీనన్‌కు మాత్రమే ఉందని చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు.

నిత్యామీనన్‌ ఈ పాత్రకు తగ్గట్లుగా లావు పెరగడంతో పాటు కట్టు బొట్టు విషయంలో కూడా మంచి జాగ్రత్తలు తీసుకుంటుంది. అందుకే ఇంత బాగా ఈ పాత్రకు ఆమె సూట్‌ అయ్యిందని నిత్యామీనన్‌ అభిమానులు అంటున్నారు. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న అమ్మ బయోపిక్‌ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమిళంలో అమ్మ బయోపిక్‌లు మూడు తెరకెక్కుతున్నాయి. అందులో ఈ చిత్రంపై ప్రత్యేకమైనది అంటూ తమిళనాట ప్రచారం జరుగుతోంది.