టీజర్ రివ్యూ : ‘ఒక మనసు’

‘ఒక మనసు’ .. మెగా బ్రదర్ నాగబాబు తనయ నిహారిక వెండితెర ఎంట్రీ ఇస్తున్న చిత్రమిది. నాగశౌర్య హీరో. రామరాజు దర్శకుడు. తాజాగా ఈ చిత్రం టీజర్ బయటికివచ్చింది. అందమైన ప్రేమ కధ ఇది. చాలా కూల్ గా క్యూట్ గా వుంది టీజర్. అవుట్ అండ్ అవుట్ లవ్ స్టొరీ ఇది. టీజర్ మొత్తం ఆహ్లాదకరంగా వుంది. ఈ టీజర్ సింప్లీ సూపర్బ్ అనిపించింది. ఈ చిత్ర దర్శకుడు రామరాజు గతంలో మల్లెల తీరంలో సిరిమ‌ల్లె పువ్వు లాంటి క్లాస్ సినిమా తీశాడు. ఆ సినిమాకి మంచి రివ్యూస్ వచ్చాయి గానీ, కమర్శియల్ గా వర్క్ అవుట్ కాలేదు. మరి, ‘ఒక మనసు’ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.