ప్రేమికుల రోజు సందర్భంగా.. కన్నుగీటిన వీడియోతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్..ఈమెకు ఎంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందో చెప్పాల్సిన పనిలేదు..ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్ లో కన్నుగీటిన వీడియో ఉందంటే అర్ధం చేసుకోవాలి అమ్మడు ఏ రేంజ్ లో ఆకట్టుకుందో.. ఈ వీడియో తర్వాత పలు అగ్ర సంస్థలు సైతం తన్మ బ్రాండ్ లకు ఈమెను బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకోవడం జరిగింది.
ప్రస్తుతం ఈ భామ ఒరు ఆదార్ లవ్ సినిమాలో నటిస్తుంది..తాజాగా దీనికి సంబందించిన ఓ వీడియో సాంగ్ విడుదల చేసారు. ఈ సాంగ్ సరికొత్త రికార్డు ను సొంతం చేసుకుంది. యూట్యూబ్‌లో అతి తక్కువ కాలంలో ఎక్కువ డిస్‌లైక్‌లు సాధించిన సాంగ్‌గా రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటికే ఈ పాటను పది లక్షలకు పైగా వీక్షించగా, రెండు లక్షలకు పైగా డిస్‌లైక్‌లతో ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడు ఈ పాటే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సడెన్ గా ప్రియా కు ఎంత భారీ వ్యతిరేకత రావడం కారణం ఏంటి అనేది తెలియదు కానీ ప్రస్తుతం డిస్‌లైక్‌లు మాత్రం హాట్ టాపిక్ అయ్యింది. మీరు కూడా ఈ వీడియో సాంగ్ ఫై లుక్ వెయ్యండి.