పంతం మూవీ టాక్..

గత కొంతకాలంగా సరైన హిట్ లేకుండా ఇబ్బంది పడుతున్న గోపీచంద్, తాజాగా నూతన దర్శకుడు కె.చ‌క్ర‌వ‌ర్తి దర్శకత్వంలో శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కె.కె. రాధామోహ‌న్ నిర్మాణం లో ‘పంతం’ అనే సినిమాలో నటించాడు. గోపీచంద్ 25వ చిత్రం గా వస్తున్న ఈ మూవీ ఫై గోపీచంద్ తో పాటు అభిమానులు , సినీ ప్రేక్షకులు భారీ ఆశలే పెట్టుకున్నారు.

ట్రైలర్ సైతం ప్రేక్షకుల అంచనాలు రెట్టింపు చేసే విధంగా ఉండడం తో ఈ సినిమాను చూసేందుకు బాగా ఆసక్తి కనపరిచారు. ఈరోజు ఈ సినిమా గ్రాండ్ గా విడుదలయింది. అంతకంటే ముందే ఓవర్సీస్ లో ప్రీమియర్ షోస్ పడడం జరిగింది. మరి ప్రీమియర్ షోస్ చూసిన ప్రేక్షకులు సినిమా గురించి ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.

గత చిత్రాలకు భిన్నంగా గోపీచంద్ పొలిటికల్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ ను నమ్ముకొని పంతం చేసాడు. అతడి నమ్మకం వమ్ము కాలేదు. ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండాఫ్ ఎమోషనల్‌గా గ్రిప్పింగ్‌గా ఉందని నెటిజన్లు చెబుతున్నారు. ఏ విషయంలోనూ వెనక్కి తగ్గని యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా గోపీచంద్ యాక్టింగ్ అద్భుతంగా ఉందని , గోపీచంద్, మెహ్రీన్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యిందంటున్నారు.

‘పంతం’ మెసేజ్ ఓరియెంటెడ్ సోషల్ డ్రామా అని, గోపీచంద్‌ మళ్లీ హిట్ పట్టలెక్కినట్టేనని టాక్ బాగా వినిపిస్తుంది. మరి కొందరు మాత్రం తొలి అర్ధభాగం అంత గొప్పగా ఏం లేదు. కాకపోతే కొన్ని మసాలా సన్నివేశాల వల్ల బోర్‌గా ఫీలవ్వాల్సి వచ్చిందని , సామాజిక సమస్యను కథలో జొప్పించడం వల్ల ఆసక్తికరంగా సాగిందని అంటున్నారు. ఇంటర్వెట్ ముందు కథలో వేగం పుంజుకుంటుంది. సెకండాఫ్ బాగుందని ఆడియెన్స్ చెబుతున్నారు.

ర‌మేష్ రెడ్డి డైలాగ్స్ బాగున్నాయి, కె.చ‌క్ర‌వ‌ర్తి, బాబీ ల స్క్రీన్ప్లే ఆకట్టుకుందని , గోపిసుందర్ బ్యాక్ గ్రౌండ్ బాగుందని , చ‌క్ర‌వ‌ర్తి డైరెక్షన్ అద్భుతంగా ఉందని చెపుతున్నారు. ఓవరాల్ గా ఈ మూవీ గోపీచంద్ కు కెరియర్ ను మళ్లీ నిలబెట్టిన చిత్రం గా నిలిచిపోవడం ఖాయమంటున్నారు.