ప‌వ‌న్ డైరెక్ట‌ర్‌ కి ఎన్ని క‌ష్టాలో..?

pawan-sampath-nandhi

దేవుడు వ‌ర‌మిచ్చినా.. పూజారి క‌నిక‌రించ‌లేద‌న్న‌ట్టుంది సంప‌త్‌ నంది ప‌రిస్థితి. ర‌చ్చ హిట్ త‌ర‌వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ నుంచి పిలుపొచ్చింది. అదీ.. బ్లాక్‌ బ్ల‌స్ట‌ర్ సినిమా గ‌బ్బ‌ర్ సింగ్‌ కి రీమేక్ ఛాన్స్‌. దాంతో సంప‌త్‌ నంది బూరెట బుట్ట‌లో ప‌డ్డాడ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ పెద్ద‌లు భావించారు. ఈ సినిమాని సంప‌త్ ఓ ఛాలెంజ్‌గా తీసుకొన్నాడు కూడా. కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ సినిమా సెట్స్‌పైకి రాలేదు. గ‌బ్బ‌ర్ సింగ్ 2 ఎప్పుడు మొద‌ల‌వుతుందో.. ఎవ్వ‌రూ చెప్ప‌లేని ప‌రిస్థితి. ఈలోగా రెండు మూడుసార్లు స్ర్కిప్ట్ కూడా మార్చుకొన్నాడు. కానీ ప‌వ‌న్ ఇంకా గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేదు. ఎన్నిక‌ల త‌ర‌వాతే ఈ సినిమా మొద‌లువుతుంది. అప్పుడూ ప‌వ‌న్ మూడ్ ఎలా ఉంటే అలా న‌డుచుకోవాల్సిందే. ముందు ఓ మైగ‌డ్ చేద్దాం, ఆ త‌ర‌వాతే.. ఈ సినిమా అన్నా.. కామ్‌ గా ఉండాల్సిందే. ఎందుకొచ్చిన గొడ‌వ‌..?? ఈలోగా మ‌రో సినిమా మొద‌లెట్టేద్దాం అనుకొన్నా కుద‌ర‌డం లేదు. ఒక‌వేళ సంప‌త్ మ‌రో సినిమా టేక‌ప్ చేస్తే ప‌వ‌న్‌ కి కోపం రావ‌చ్చు. దాంతోపాటు గ‌బ్బ‌ర్ సింగ్ 2 లేదేమో అన్న అనుమానాలు అభిమానుల్లో మ‌రింత బ‌ల‌ప‌డే ఛాన్స్ ఉంది. అందుకే సంప‌త్‌ నందికి ఏం చేయాలో పాలుపోవ‌డం లేదు. ప్ర‌తిరోజూ గ‌బ్బ‌ర్ సింగ్ 2 ఆఫీసుకు వెళ్లడం. స్ర్కిప్టు ఓసారి చూసుకోవ‌డం, సాయింత్రం తిరిగి వ‌చ్చేయ‌డం.. ఇదీ తంతు. పాపం… హిట్ డైరెక్ట‌ర్‌ కి ఎన్ని క‌ష్టాలో..?.