సైరా కు పవన్ మరో సాయం..

మెగా స్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం అక్టోబర్ 02 న గ్రాండ్ గా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రమోషన్లో భాగంగా నిన్న విడుదల చేసిన చిత్ర ట్రైలర్ కు అభిమానుల నుండి ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తుంది. ట్రైలర్ విడుదల కార్య క్రమంలో రామ్ చరణ్ మాట్లాడుతూ మరో ఆసక్తికర విషయాన్నీ తెలియజేసి మరింత ఆసక్తి లేపాడు.

సైరా టీజర్ లో పవన్ కళ్యాణ్ గారి వాయిస్ ఓవర్ ఉంది కదా, మరి మూవీలో కూడా పవన్ వాయిస్ ఓవర్ ఉంటుందా అని మీడియా ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానంగా చరణ్ కొంచెం సందేహిస్తూనే అవునని సమాధానం చెప్పాడు. అంటే పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ సైరా మూవీ లో కూడా ఉంటుందని ఫిక్స్ అవ్వొచ్చు. సైరా టీజర్ కి పవన్ వాయిస్ ఓవర్ సినిమా ఫై ఆసక్తి పెంచిన సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ చేస్తున్నారు. చిరంజీవి కి జోడి గా నయనతార నటిస్తుండగా బిగ్ బి , సుదీప్ , విజయ్ సేతుపతి , జగపతి మొదలగు వారు నటిస్తున్నారు.