మహేష్ కు విషెష్ అందించిన పవన్ కళ్యాణ్

67వ జాతీయ చలనచిత్ర అవార్డులను సోమవారం కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందనే. ఈ అవార్డ్స్ లో నాని జెర్సీ చిత్రానికి అలాగే మహేష్ బాబు మహర్షి చిత్రాలకు అవార్డ్స్ దక్కడం విశేషం. నాని నటించిన జెర్సీ చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు దక్కగా.. ఉత్తమ వినోదాత్మక చిత్రంగా మహేశ్ బాబు నటించిన మహర్షి నిలిచింది. అలాగే ఇదే సినిమాకి ఉత్తమ కొరియోగ్రాఫర్‌ అవార్డును రాజు సుందరం గెలుచుకున్నారు.

ఈ అవార్డ్స్ రావడం పట్ల అభిమానులు , సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రెండు చిత్రాలకు బెస్ట్ విషెష్ అందించారు. పవన్ ప్రత్యేకంగా విషెష్ అందించడం తో అభిమానులు, చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ సినిమాల విషయానికి వస్తే..ఏప్రిల్ 09 న వకీల్ సాబ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.