‘వకీల్ సాబ్’ వచ్చేశాడు !

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’గా మారిపోయాడు.  పింక్ రిమేక్ తో పవన్ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు. మే నెలలో వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

తాజాగా వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. గతంలో సెట్స్ నుంచి లీకైన ఫోటోని టైటిల్ లోగోలో ఉంచారు. ఇక ఫస్ట్ లుక్ లో గుబురుగడ్డెం లుక్ లో పుస్తకం పఠనం చేస్తున్నాడు పవన్. అయితే, ఆయన ఉన్న ప్లేసే కొత్తగా ఉంది. ఎవరైనా ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో పుస్తక పఠనం చేస్తారు. కానీ, పవన్ మాత్రం స్టోర్ రూమ్ లో పుస్తకం చదువుతున్నాడు. అలా ఎందుకు ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక వకీల్ సాంబ్ నుంచి ఫస్ట్ సాంగ్ ఈ నెల 8న రాబోతుంది.

బాలీవుడ్ లో బిగ్ బీ అమితాబ్, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పింక్’. సూపర్ హిట్ అయింది. ఇదే కథతో తమిళ్ లో రిమేక్ అయి అక్కడ హిట్ అయింది. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో తెలుగులో వకీల్ సాబ్ గా రిమేక్ అవుతోంది. దీంతో వకీల్ సాబ్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. మరీ.. ఆ అంచనాలని వకీల్ సాబ్ అందుకుంటాడేమో చూడాలి.