పేట ఓవర్సీస్ కలెక్షన్స్..

సూపర్ స్టార్ రజినీకాంత్ – కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం పేట. 2.ఓ సక్సెస్ తర్వాత రజనీ నుండి రావడం, భాషా, ముత్తు, అరుణాచలం టైపులో సినిమా ఉండబోతుందని ప్రచారం జరగడంతో భారీ అంచనాల మధ్య సినిమా విడుదల అయ్యింది. తమిళ్‌తో పాటు తెలుగులో జనవరి 10న విడుదలైంది. ఇక ఓవర్సీస్ లో దాదాపు 220 లొకేషన్స్‌లో పేట రిలీజ్ అయ్యింది.

ప్రస్తుతం ఓవర్సీస్ ప్రీమియర్ కలెక్షన్ల వివరాలు బయటకొచ్చాయి. తెలుగు, తమిళ భాషల్లో ప్రీమియర్ల ద్వారా దాదాపు 5 లక్షల 45వేల డాలర్స్ రాబట్టినట్టు తెలుస్తుంది. మన కరెన్సీ లెక్కల ప్రకారం రూ.3 కోట్ల 84 లక్షలు వసూలు చేసిందని మాట. ఇక సినిమా టాక్ విషయానికి వస్తే తమిళంలో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ, తెలుగు లో మాత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.