ప‌వ‌ర్ డేట్ ఫిక్స్‌

raviteja
ర‌వితేజ పోలీస్ ఆఫీస‌ర్ పాత్రలోక‌నిపించ‌నున్న చిత్రం ప‌వ‌ర్‌. బాబి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. హ‌న్సిక‌, రెజీనా క‌థానాయిక‌లు. అన్ని కార్య‌క్ర‌మాలూ పూర్తి చేసుకొని విడుద‌ల‌కు సిద్ద‌మైందీ చిత్రం. సెప్టెంబ‌రు 5న ప‌వ‌ర్ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. నిజానికి ఈనెల 29నే ప‌వ‌ర్ రావాల్సింది. కానీ ర‌భ‌స కార‌ణంగా ఓ వారం వెన‌క్కి వెళ్లింది. సెప్టెంబ‌రు 5న వ‌స్తుందా? రాదా? అనే అనుమానాలూ ఉండేవి. ఎందుకంటే… నాగ‌చైత‌న్య సినిమా ఒక లైలా కోసం అదే రోజు విడుద‌ల చేయాల‌నుకొన్నారు. ఇప్పుడు ప‌వ‌ర్ రాక‌తో చైతూ సినిమా వెన‌క్కి వెళుతోంది. త‌మ‌న్ అందించిన ప‌వ‌ర్ పాట‌లు… మాస్‌కి బాగా ఎక్కేశాయ్‌. నోటంకీ.. నోటంకీ దుమ్ము రేపుతోంది. బ‌లుపు తో ఫామ్‌లోకి వ‌చ్చిన ర‌వితేజ‌.. వ‌రుస‌గా రెండో హిట్ కొడ‌తాడేమో చూడాలి.