Kalki 2898 AD : ఇటలీలో ‘కల్కి’ సాంగ్ షూటింగ్.. ఫోటో షేర్ చేసిన చిత్రయూనిట్


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమాలోని సాంగ్ షూటింగ్ కోసం ఇటలీ వెళ్ళింది.

ఇటలీలో ఆటా పాటా అంటూ.. ఒక ఫోటోను కూడా షేర్ చేసింది చిత్రయూనిట్. ఈ ఫొటోలో ప్రభాస్, నాగ్ అశ్విన్, దిశా పటాని తో పాటు మొత్తం చిత్ర యూనిట్ వున్నారు. ఇక ఇటలీలోని అద్భుతమైన లోకేషన్స్ లో ఈ పాటని చాలా గ్రాండియర్ గా చిత్రీకరించనున్నారు. ఇదిలా ఉంటే ‘కల్కి 2898 AD’ గత సంవత్సరం శాన్ డియాగో కామిక్-కాన్‌లో సంచలనం సృష్టించగా.. ఇప్పటికే విడుదలైన టీజర్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచింది.