Salaar OTT : ‘సలార్’ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స్..!


ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ సీజ్ ఫైర్ కోసం మూవీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రం ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ప్రభాస్ లాంటి కటౌట్ కి మంచి ఎలివేషన్స్ ఇవ్వడంలో ప్రశాంత్ నీల్ తనదైన మార్క్ చూపించాడు.

Salaar Review : సలార్ రివ్యూ – ప్రభాస్ ఊచకోత !

ఇకపోతే ‘సలార్’ ఓటీటీ స్ట్రీమింగ్ పార్టనర్ కి సంబంధించిన వివరాలు కన్ఫర్మ్ అయ్యాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ‘సలార్’ డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది. అయితే దాదాపు రెండు నెలల తర్వాత OTTలో ప్రసారం చేసే అవకాశం వుంది. ఇక ఈ భారీ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందించగా హోంబలే ఫిల్మ్స్ వారు నిర్మించారు.