‘సలార్’ టీజర్ వచ్చేసింది.. కానీ ?


పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో హోంబలే ఫిలింస్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘సలార్ పార్ట్ 1: సీస్ ఫైర్‌’. మూవీ గురించి ప్రకటన వెలువడిన రోజు నుంచి ఫ్యాన్స్, ప్రేక్ష‌కులు ఎంతో ఎగ్జ‌యిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా టీజ‌ర్‌ను గురువారం ఉద‌యం 5 గంట‌ల 12 నిమిషాల‌కు విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌టం ద్వారా ఈ ఎగ్జ‌యిట్‌మెంట్‌ను మ‌రింత‌గా పెంచారు. అంద‌రూ ఊహించిన‌ట్లే ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ త‌న యూనివ‌ర్స్ నుంచి థ్రిల్లింగ్ యాక్ష‌న్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

సింహం, చిరుత, పులి, ఏనుగు చాలా ప్రమాదకరం.. కానీ జురాసిక్ పార్కులో కాదు..ఎందుకంటే అక్కడ ఉండేది.. అంటూ టినూ ఆనంద్ డైలాగ్‌తో టీజర్ మొదలవుతుంది. పవ‌ర్‌ఫుల్ డైలాగ్స్‌తో ఉన్న టీజ‌ర్‌ను చూస్తుంటే ఈ భారీ బ‌డ్జెట్ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గ రాస్తుంద‌నిపిస్తుంది. స‌లార్ యూనివ‌ర్స్‌లోని పార్ట్ 1కు సంబంధించిన టీజ‌ర్ మాత్ర‌మే ఇది. ఇక థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌లో ఇంకెన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలుంటాయ‌నేది అంద‌రిలోనూ క్యూరియాసిటీని క‌లిగిస్తోంది. కానీ, ఈ టీజర్ లో ప్రభాస్ లుక్ ను పూర్తిగా రివీల్ చేయకుండా పిడికిలి బిగించిన తన చేతిని మాత్రమే చూపించడంతో ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమాకి విజ‌య్ కిర‌గందూర్ నిర్మాత‌. ఇదే బ్యాన‌ర్‌లో రూపొందిన కె.జి.య‌ప్ సినిమాలో సాంకేతిక నిపుణులే స‌లార్ సినిమాకు కూడా వ‌ర్క్ చేస్తున్నారు. ఇండియ‌న్ సినిమా స్క్రీన్‌పై ఇలాంటి సినిమా రాలేదనేంత గొప్ప‌గా రూపొందిస్తున్నారు. రామో జీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా కోసం 14 భారీ సెట్స్ వేసి మ‌రీ చిత్రీక‌రించారు. ప్ర‌భాస్‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమార‌న్‌, శ్రుతీ హాస‌న్‌, జ‌గ‌ప‌తిబాబు వంటి భారీ తారాగ‌ణంతో ప్ర‌శాంత్ నీల్ అన్ కాంప్ర‌మైజ్డ్‌గా సినిమాను రూపొందిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 28న తెలుగు, క‌న్న‌డ‌, హిందీ, మ‌ల‌యాళ‌, త‌మిళ భౄష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ రేంజ్‌లో విడుద‌ల‌వుతుంది.