ఫుట్ బాల్ ఆడబోతున్న రెబల్ స్టార్

prabhasయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌, ప్రస్తుతం ఫుట్‌బాల్‌ ప్రాక్టీస్‌లో కాలం గడుపుతున్నాడు. కేవలం సరదాకోసం ఫుట్‌బాల్‌ ఆడుకుంటూ కాలం గడపడం కాదు, పక్కాగా కోచ్‌ను కూడా పెట్టుకుని, పూర్తిస్థాయిలో రూల్స్‌ అండ్‌ రెగ్యులేషన్స్‌ అన్నింటి మీదా పట్టు ఉండేలా, అటు థియరీ కూడా చెప్పించుకుంటూ, ఇటు మైదానంలో ప్రాక్టికల్స్‌ కు కూడా హాజరవుతున్నాడట. హాయిగా సినిమాలు చేసుకోకుండా ఈ ఫుట్ బాల్ కష్టాలు ఏమిటో అనుకునే వారికి, సినిమా కోసమే ఈ ఫుట్ బాల్ అని చెబుతున్నాడట. విషయమేమిటంటే … రాజమౌళి రూపొందిస్తోన్న సినిమాలో ప్రభాస్ ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపించనున్నాడు. పాత్రకు అనుగుణంగా హీరో ను చెక్కడం లో రాజమౌళి నెంబర్ వన్. గతం లో నితిన్ చేత రగ్బీ ఆడించిన రాజమౌళి ఇప్పుడు ప్రభాష్ ను ఓ ఫుట్ బాల్ ప్లేయర్ ని చేశాడన్నమాట.