‘సలార్’ టీజర్ రిలీజ్ డేట్ & టైం ఫిక్స్..


పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, కేజీఎఫ్ ఫేం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‍లో వస్తున్న మూవీ ‘సలార్’. కేజీఎఫ్‌ వంటి బంపర్‌ హిట్‌ తర్వాత ప్రశాంత్‌ నీల్‌ ఈ సినిమా చేయడంతో ఈ చిత్రంపై అంచనాలు చాలా భారీగా ఉన్నాయి. ఇక హోంబలే బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇకపోతే ఈ సినిమా టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రభాస్ అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ నిరీక్షణకు తెరదించుతూ ‘సలార్’ టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్.

‘సలార్’ టీజర్ ను జూలై 6న ఉదయం 5 : 12 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా పోస్టర్ ను షేర్ చేసారు మేకర్స్. ఈ పోస్టర్ చాలా ఆసక్తికరంగా వుంది. దీంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరి రావు, భువన గౌడ కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.