‘ప్రాజెక్ట్ కే’ ఫస్ట్ గ్లింప్స్‌ డేట్ ఫిక్స్ !!


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘ప్రాజెక్ట్ కే’. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజ‌యంతీ మూవీస్ అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇక అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌ కీలక పాత్ర పోషిస్తుండగా, క‌మ‌ల్ హాస‌న్ ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకొనే, దిశా పటానీ నటిస్తున్నారు.

ఇదిలావుంటే జూలై 20, 2023న అమెరికాలోని శాన్ డియాగో కామిక్-కాన్ ఈవెంట్ లో Project K మూవీ టైటిల్ ఆవిష్కరిస్తున్నట్లు ఇటీవల చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో అప్డేట్ అందించింది చిత్రబృందం. అదేంటంటే ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను జూలై 20న అమెరికాలో, జూలై 21న ఇండియాలో విడుదల చేయనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో ప్రభాస్ మరియు అమితాబ్ బచ్చన్‌లు పిడికిలి కొట్టడం కనిపిస్తుంది. ఇక ఈ వేడుకకు ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, నాగ్ అశ్విన్ హాజరుకానున్నారు. కాగా ఈ సినిమా జనవరి 12, 2024న సంక్రాంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.