చవితికి ‘లింగా’ లుక్కు

rajani
రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘లింగా’. అనుష్క, సోనాక్షి సిన్హా కథానాయికలు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రాక్‌లైన్ వెంకటేష్ నిర్మాత. చిత్రీకరణ చివరిదశకొచ్చింది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను వినాయకచవితి సందర్భంగా విడుదల చేయడానికి చిత్రబృందం ప్రయత్నాలు చేస్తోంది. ఈ చిత్రంలో రజనీ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. స్వాతంత్య్రం ముందు, తర్వాత తరాలకు చెందిన రెండు పాత్రల్లో రజనీకాంత్ కనిపిస్తారు. చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్.