‘రాక్షసుడు’ ఫస్ట్ డే నైజాం కలెక్షన్స్..

డిఫ‌రెంట్ కాన్సెప్ట్ చిత్రాల‌తో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న యంగ్‌ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క‌థానాయ‌కుడిగా, ర‌మేష్ వ‌ర్మ పెన్మ‌త్స ద‌ర్శ‌క‌త్వంలో ఎ హ‌వీష్ ల‌క్ష్మ‌ణ్ కొనేరు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై కొనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌గా తెరకెక్కిన చిత్రం `రాక్షసుడు`. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘రాచ్చసన్’ సినిమాను ‘రాక్షసుడు’ పేరుతో తెలుగులో రీమేక్ చేశారు.

సాయి శ్రీనివాస్ కు జోడిగా అనుపమా పరమేశ్వరన్ నటించింది. ట్రైలర్‌తో సినిమాపై ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా మంచి అంచనాల మధ్య శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. రివ్యూస్ తో పాటు పబ్లిక్ కూడా సినిమా చాల బాగుందని..శ్రీనివాస్ యాక్టింగ్ అదరగొట్టాడని..డైరెక్షన్ బాగుందని చెపుతుండడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లు పెరుగుతుంది. పబ్లిక్ టాక్ బాగుండడం తో ఈ సినిమాను చూసేందుకు ఫ్యామిలీ ఆడియన్స్ సైతం ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.

ఫస్ట్ డే కలెక్షన్ల విషయానికి వస్తే నైజాం ఏరియాలో 56లక్షల డిస్ట్రిబ్యూటర్ షేర్ సాధించినట్లు తెలుస్తుంది. ఓపెనింగ్స్ ఆశించినంతగా లేకున్నా మౌత్ టాక్ బాగుండటంతో మిగిలిన శని,ఆది వారాంత దినములలో కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.